Anand vs Anand (Telugu)
Author :Sukumar Mandalika
Buy the book
Product Details
సృష్టి ప్రారంభం నుండి పృథ్వి మీద పోరాటాలు జరుగుతూనే వున్నాయి. నిరు పేదల పోరాటం బ్రతికి బట్ట కట్టడం కోసం. ధనవంతుల పోరాటం మరింత ధనాధికారాల కోసం. వీటన్నిటిని మించి అనాదిగా జరుగుతున్న పోరాటం ఒకటుంది . . . . స్త్రీ వర్సస్ పురుషుడు !
స్త్రీ కంటే తనది...
Author Information
వృత్తి రీత్యా జివిత కాల అనుభవం గల ఇంజినియర్. అభిరుచి రీత్యా సంగీతం సాహిత్యం పట్ల ఆసక్తి గలవాడు. రెండు ఇంగ్లీషు నవల రచయిత. ఇంగ్లీషులో ప్రధమంగా వ్రాస...
Buy the book
Book Details
Category :Fiction
Print ISBN No :9788194580225
Language :Telugu
You can read this eBook using any of the following e-Reder apps and devices:
IOS
Android
Mac
Windows
PRODUCT DETAILS
సృష్టి ప్రారంభం నుండి పృథ్వి మీద పోరాటాలు జరుగుతూనే వున్నాయి. నిరు పేదల పోరాటం బ్రతికి బట్ట కట్టడం కోసం. ధనవంతుల పోరాటం మరింత ధనాధికారాల కోసం. వీటన్నిటిని మించి అనాదిగా జరుగుతున్న పోరాటం ఒకటుంది . . . . స్త్రీ వర్సస్ పురుషుడు !
స్త్రీ కంటే తనది ఉత్కృష్టమైన జననం అని పురుషుడి ఆలోచన. పురుషుడి కంటే తనది ఉత్తమమైన పుట్టుక అని స్త్రీ భావన. వీరిరువురి ఈ మౌలిక సంఘర్షణలో విజయం ఏ ఒక్కరికి కాదు లభ్యం. పరాజయం మాత్రం ఇరువురికి తధ్యం.
నిజానికి రాత్రి పగలు వలె, నాణెము యొక్క ఇరు పక్కల వలె, స్త్రీ పురుషులలో ఒకరు లేనిదే మరొకరి అస్తిత్వం అసంభవం, మనుగడ దుర్భరం. ఒకరు గానమైతే మరొకరు ఆ గానంలోని స్వరం. ఒకరు స్వప్నమైతే మరొకరు ఆ స్వప్నాన్ని కలుగజేసే మైకం. ఈ పరమ సత్యాన్ని గ్రహించి పరస్పర ప్రేమకు లోనయ్యే దంపతులు అదృష్టవంతులు. గ్రహించక ఘర్షణ పడే దంపతులు శాపగ్రస్తులు.
ఆనంద్ అవంతీల ప్రేమగాధలో ఎందుకో ఘర్షణ ఏర్పడింది. వారు శాపగ్రస్తులుగా మిగిలిపోతారా? లేక అదృష్టవంతులవుతారా? . . . . "ఆనంద్ వర్సస్ ఆనంద్" ఈ రహస్యం బయట పెడుతుంది.
AUTHOR INFORMATION
వృత్తి రీత్యా జివిత కాల అనుభవం గల ఇంజినియర్. అభిరుచి రీత్యా సంగీతం సాహిత్యం పట్ల ఆసక్తి గలవాడు. రెండు ఇంగ్లీషు నవల రచయిత. ఇంగ్లీషులో ప్రధమంగా వ్రాసిన నవల యొక్క అనువాదమే ఈ తొలి తెలుగు నవల. ఇంగ్లీషులో, తెలుగులో ఇంకెన్నో నవలలు వ్రాయాలనే అభిలాషతో సుకుమార్ మండలీక తన సతీమణి పద్మావతితో మద్రాసులో నివసిస్తారు.